మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ ?
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అనిల్ తన కెరీర్ లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. సినిమాల పరంగా తన కెరీర్ సాఫీగా సాగుతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ముందు వరసలో నిలవడం విశేషం.
అయితే అనిల్ రావిపూడి రీసెంట్ గా దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.... ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. కాగా, ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి ఇప్పుడు తన తదుపరి సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తి చేసి హీరోయిన్ ని వెతికే పనిలో అనిల్ రావిపూడి ఉన్నట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో అనిల్, చిరంజీవి అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుందని అనిల్ రావిపూడి శుభవార్త అందించాడు.
తాజాగా అనిల్ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తీయబోయే సినిమా స్క్రిప్ట్ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు చేయించారట. తాను తీసే సినిమా కథలకు అనిల్ రాయపూడి వైజాగ్ ను తాను సెంటిమెంట్ గా ఫీల్ అవుతానని వెల్లడించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.