ఐశ్వర్య రాజేష్ కు మరో బంపర్ ఆఫర్...?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఇక మరికొంతమంది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతారు. ఎన్నో సినిమాలలో నటించిన అనంతరం సక్సెస్ సాధిస్తారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ చిన్నది తనదైన నటన, అందంతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.
తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. ఇక రీసెంట్ గా ఈ చిన్నది నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. ఆ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ద్వారా ఈ చిన్నది ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది.
ప్రస్తుతం ఈ చిన్న దానికి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిన్నది అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుందట. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తన దర్శకత్వంతో మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు అనిల్ రావిపూడి. తన తదుపరి సినిమాను ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్ కు నటించే అవకాశాన్ని ఇచ్చాడట. ఈ విషయం తెలిసి ఈ చిన్నది సంబరపడిపోతుందట. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆనందంలో మునిగి తేలుతుందట. ఈ సినిమా దాదాపుగా పూర్తయిందట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. అయితే ఇంకా ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారట. ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం త్వరలోనే వెలువడనుంది.