సమంత కొత్త ప్రయాణం...?
సోషల్ మీడియాలోనూ సమంతకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, సమంత ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలలో నటించడం లేదు. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్ లో సిరీస్ లు చేస్తూ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతున్నారు.
కాగా, ప్రస్తుతం సమంత హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సమంత తన సొంత నిర్మాణ సంస్థ "త్రలాల మూవింగ్ పిక్చర్స్"ఆధ్వర్యంలో మొదటి ప్రాజెక్ట్ "శుభం" చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
శుభం సినిమా కథ ను వసంత్ మరిగంటి రాశారు. కాగా, ఈ సినిమాను బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించనున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, చరణ్ పెరి, శ్రియా కొంతం, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారిని బండి సినిమాతో ప్రవీణ్ కండ్రెగుల సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కాగా, సమంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.