అఖండ 2 కు కర్నూలుతో లింక్ ఉందా... రెండో పాత్ర రివీల్ అయ్యేది అక్కడే...!
నందమూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘ అఖండ ’ సినిమా ఎంత అద్భుత విజయాన్ని సాధించిందో చూశాం. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న సినిమా అఖండ 2 తాండవం. ఈ క్రేజీ సీక్వెల్ మీద కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో జరుగుతోంది. అక్కడ బాలయ్య అఘోర పాత్ర పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సీన్లు మొత్తం పూర్తి చేశాక తర్వాత షెడ్యూల్ ను దర్శకుడు బోయపాటి శ్రీను కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కర్నూలు షెడ్యూల్ లో బాలయ్య రెండో పాత్ర పై సీన్లు షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సీన్లు తీసేందుకు ప్రత్యేకంగా అక్కడ ఓ సెట్ కూడా వేస్తారని తెలుస్తోంది. ఇక కర్నూలులో బాలయ్య సినిమాల షూటింగ్ జరిగితే ఖచ్చితంగా సూపర్ హిట్టే అన్న సెంటిమెంట్ గతంలో చాలాసార్లు ఫ్రూవ్ అయ్యింది. ఇక కర్నూలులో జరిగే షెడ్యూల్ లో బాలయ్యతో పాటు జగపతి బాబు, విలన్ పాత్రధారి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదు కావడంతో అఖండ 2 – తాండవం పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ను వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.