
ఆ స్పెషల్ రోజునే గుడ్ న్యూస్..మెగా ఫ్యాన్స్ ఎగిరి గంత్తేసే తీపి కబురు వచ్చేస్తుందోచ్..!
దానికి తగ్గట్టే గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సంపాదించుకొని స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నాడు . అలాంటి రామ్ చరణ్ - గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ ముందు ఉన్న బిగ్ టార్గెట్ ఆయన ఖాతాలో హిట్ పడడమే కాదు మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయాలి. ఆయన పై జరిగిన ట్రోలింగ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయేలా హిట్ కొట్టాలి . ప్రజెంట్ ఇప్పుడు అదే కాన్సన్ట్రేషన్ తో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కష్టపడుతున్నాడు. కాగా రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది .
నిజానికి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా కంటే ముందే ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమాని ఓకే చేశారు అంటూ టాక్ వినిపించింది . చిరంజీవి - ప్రశాంత్ నీల్ - రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది . అయితే సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో మెగా ఫాన్స్ డిసప్పాయింట్ అయ్యారు . కాగా ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమా అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది . మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు . కచ్చితంగా స్టార్ సెలబ్రిటీస్ పుట్టినరోజు నాడు ఏదైనా వాళ్ళ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తారు. అలాగే చరణ్ - బుచ్చి బాబు సనా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనోతున్నారట . అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ ఇవ్వబోతున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చరణ్ కి ఫ్యాన్స్ ని ఎలా సంతోష పెట్టాలి అనే విషయం బాగా తెలుసు అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు..!