ఎన్టీఆర్ , ఏఎన్నార్ కలిసి ఆ స్టార్ హీరోయిన్‌ను ఎందుకు బ్యాన్ చేశారు..?

frame ఎన్టీఆర్ , ఏఎన్నార్ కలిసి ఆ స్టార్ హీరోయిన్‌ను ఎందుకు బ్యాన్ చేశారు..?

RAMAKRISHNA S.S.
7 , 8 దశాబ్దాల తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో హీరోలు , హీరోయిన్లు వచ్చారు .. అలా వచ్చిన వారిలో కొందరు హీరోలు స్టార్ హీరోలు గానే మరణించారు .. అలాగే కొందరు హీరోలు మూడు నాలుగు దశాబ్దాలుగా కూడా స్టార్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు .. ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో హీరోలు వచ్చిన భవిష్యత్తులో ఎంతమంది హీరోలు సినిమాలలోకి వచ్చినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం సీనియర్ హీరో లు అయినా నందమూరి నట స్వరూప ఎన్టీఆర్ తో పాటు నటసామరట్‌ అక్కినేని నాగేశ్వరరావును తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా భావిస్తారు ..

 
మద్రాసులో తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ , ఏఎన్నార్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రజలకు కూడా అపారమైన గౌరవం ఉంది .. ఎన్టీఆర్ , ఏఎన్నార్ కేవలం సినిమా హీరోలుగా మాత్రమే కాకుండా తమ జీవితంలో ప్రత్యేకమైన మనుషులుగా తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెక్కుచెదరని ముద్ర వేసుకున్నారు .. వీరిద్దరూ తమ కేరీర్‌లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించారు ..అయితే ఒక స్టార్ హీరోయిన్‌ విషయంలో వీరిద్దరూ కలిసి ఆమెపై నిషేధం విధించిన సందర్భం ఉంది .. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను ఊపేసిన జమున .. జమున షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎంత స్టార్ హీరో ఉన్నా పెద్ద డైరెక్టర్ ఉన్నా కూడా సెట్ లో ఎవరిని లెక్కచేసేసెవారు కాదట ..

 
కాలు మీద కాలు వేసుకుని కనీసం హీరోకు నమస్కారం కూడా పెట్టేవారు కాదట. ఎవరైనా ప్రశ్నిస్తే హీరోకు తాను ఏం తక్కువ అన్నట్టుగా మాట్లాడే వారట జమున .. అక్కినేని నాగేశ్వరరావు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలాగే బిహేవ్ చేయడం తో దానికి నోచుకున్న ఏఎన్ఆర్ , ఎన్టీఆర్ తో చెప్పి బ్రదర్ జమున చాలా అహం బావి ఆమెకు మన సినిమాలలో అవకాశాలు ఇవ్వవద్దు అని చెప్పడం తో దాదాపు మూడేళ్ల పాటు జమునకు ఎన్టీఆర్ , ఏఎన్నార్ తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వలేదట .. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు వారు ముందుగానే చెప్పి జమున ఉంటే తాము మీ బ్యానర్లో సినిమాలు చేయమని చెప్పడం తో ఎన్టీఆర్ , ఏఎన్నార్ అలాగే చేశారు .. చివరకు నాగిరెడ్డి , చక్రపాణి ఈ విషయంలో జోక్యం చేసుకొని రాజీ కుదరచడం తో జమున ఆ తర్వాత తిరిగి ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినిమాలలో నటించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: