
బన్నీ- స్నేహారెడ్డి జీవితాలకి శనిలా దాపురించిన స్టార్ హీరోయిన్..తెలివిగా తిప్పికొట్టిన అల్లు అరవింద్..!?
స్నేహా రెడ్డి తన ఫ్యామిలీకి సంబంధించి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అభిమానులకి అన్ని విషయాలు చెప్పేస్తుంటుంది . స్నేహ రెడ్డి - బన్నీ అరెస్ట్ లో కూడా ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వకుండా తన భర్తను ఎలా ఈ కేసు నుంచి బయట పడేయాలి అనే విధంగానే ఆలోచించి ముందుకు వెళ్ళింది. సోషల్ మీడియాలో ఎంతమంది రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్న అందరికీ చాలా కూల్ గా ఆన్సర్ చేసి శభాష్ అనిపించుకుంది . అయితే అలాంటి స్నేహారెడ్డికే కోపం తెప్పించింది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ అంటూ అప్పట్లో టాక్ వినిపించింది .
అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేసే మూమెంట్లో ఆమె అల్లు అర్జున్ కి బాగా దగ్గర అయిపోయిందట . ఎంతలా అంటే వీళ్ళ పర్సనల్ ఫంక్షన్స్ కి ప్రైవేట్ పార్టీస్ కి కూడా ఆమె అటెండ్ అయ్యేంత దగ్గరగా అల్లు అర్జున్ తో మూవ్ అయిందట . అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య చనువు చూసి ఏదో తేడా కొడుతుంది అంటూ ఇండస్ట్రీ కూడా కోడై కూసింది . అయితే అల్లు అరవింద్ మాత్రం చాలా చక్కగా ఆమెను ఇండస్ట్రీ నుంచే బయటకు పంపించేసాడు . అంతలా తన కొడుకు కోడలు జీవితంలో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వాలన్న ఊరుకోడు అల్లు అరవింద్ అంటూ అప్పట్లో చాలామంది అల్లు అరవింద్ చేసిన పనిని శభాష్ అంటూ మెచ్చుకున్నారు. అంతే కాదు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అల్లు అరవింద్ .. స్నేహ రెడ్డికి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ వచ్చారు. ప్రెసెంట్ అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ సమంత అదే విధంగా శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది . అయితే అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంకా రాలేదు..!