
వైసీపీలో విజయసాయికి ఇంత ఘోర అవమానం జరిగిందా...!
విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయి విలేకర్లతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి తమకు అనుకూలురు అయిన వ్యక్తులనే జగన్ దగ్గరకు తీసుకు వెళుతుందని ... వారి కాళ్లో లేదా చేతులో పట్టుకుంటేనో లేదా ఆర్థికంగా లబ్ధి చేకురిస్తేనే ఈ కోటరి జగన్ దగ్గరకు పంపుతారు.. ఈ కోటరి నుంచి జగన్ బయటపడితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే చాలా కష్టం. ఇంతకు మించి చెప్పగలిగిందేమీ లేదని ఒక్క మాటలో తేల్చేశారు.
మీ మనసులో నాకు స్థానం లేదు.. అలాంటి టైంలో మీతో కొనసాగాల్సిన అవసరం నాకు లేదు.. నా మనసు విరిగిపోయింది అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని .. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టవద్దు... మీకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.. భవిష్యత్తులోనూ ప్రజలకు సేవ చేయాలి.. ఎవరు నిజాలు.. ఎవరు అబద్ధాలు చెపుతున్నారో తెలుసుకుని నిర్ణయాలు తీసుకోమని జగన్ కు సూచించినట్టు విజయసాయి తెలిపారు. జగన్ నాకు పదవులు ఇచ్చినా నేను పడిన అవమానాలు తలుచుకుంటే బాధగా ఉందన్నారు. ఏదేమైనా విజయసాయి కి వైసీపీలో పైకి గౌరవం ఉందని అందరు అనుకుంటున్నా ఆయన ఎంత ఘోరంగా అవమానాలు ఎదుర్కొన్నాడో చెప్పేందుకు ఆయన మాటే నిదర్శనంగా నిలుస్తున్నాయి.