అల్లు అర్జున్ తో దిల్ రాజు .. మరో పెద్ద సినిమా చేసే దమ్ముందా ?

frame అల్లు అర్జున్ తో దిల్ రాజు .. మరో పెద్ద సినిమా చేసే దమ్ముందా ?

Amruth kumar
అల్లు అర్జున్ తర్వాత సినిమా పై అందరి చూపు ఉంది .. దీని పై సంబంధించి ఎన్నో కథనాలు కూడా వస్తున్నాయి .. ముందుగా అట్లీ సినిమా మొదలు పెడతార‌ని ఆ తర్వాత కొన్ని రోజులకు త్రివిక్రమ్ సినిమా చేస్తాడని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు ఈ వార్తల్లో కి సమాంతరంగా మరో చర్చ బ‌య‌ట‌కు కూడా వచ్చింది .. వీటిలో ఒక ప్రాజెక్టు ను దిల్ రాజు నిర్మిస్తారనేది ఆ చర్చల సారాంశం .. ఇప్పుడు వస్తున్న లెక్కల ప్రకారం బన్నీ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూ చేయాలి ..

 
కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఆ సంస్థ తప్పుకున్నట్టు .. అందులోకి దిల్ రాజు అడుగు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి . అయితే ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే .. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు కు అంత ధైర్యం చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ విషయం . రీసెంట్ గానే గేమ్ చేంజ‌ర్‌ సినిమా తో దిల్ రాజుకు భారీ షాక్ తగిలింది .. అయితే నిర్మాత గా తాను ఆ సినిమా ఫలితాన్ని ఇప్పటికిప్పుడు విశ్లేషించనని సంవత్సరం చివర్లో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటానాని .. రాజు పైకి చెబుతున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమా ఆయన్ని గట్టిగానే ఇబ్బంది పెట్టింది .

 కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని మారిన దిల్ రాజును చూస్తారంటూ ఆయన పదే పదే చెప్పుకు వస్తున్నారు .. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు కు దిల్ రాజు దూరమయ్యారు అనేది దీని భావన .. అలాగే ఎఫ్డిసి చైర్మన్ గా ఆయన పై అదనపు బాధ్యతలు ఉన్నాయి .. ఇలాంటి సమయంలో మరో భారీ బడ్జెట్ సినిమా ను తనపై పెట్టు కోవటం అనేది పెద్ద సాహసమే  .  దిల్ రాజు దీన్ని చేయకపోవచ్చు .. నిజంగా ఆయన పని చేయాలంటే ఈపాటికి ప్రభాస్ తో ఓ సినిమాను తెరపైకి తీసుకువచ్చి చేసేసి ఉండేవాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: