అప్పట్లో సీనియర్ హీరోస్ చేసినది..ఇప్పట్లో యంగ్ హీరోస్ చేయలేనిది ఇదే..!

frame అప్పట్లో సీనియర్ హీరోస్ చేసినది..ఇప్పట్లో యంగ్ హీరోస్ చేయలేనిది ఇదే..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియా వచ్చాక కంపారిజన్ అనేది ఎక్కువగా మారిపోయింది . గతంలో హీరోలు ఏం చేశారు ..? ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు..?  గతంలో హీరోయిన్స్ ఎలా ఉండేవారు..? ఇప్పుడు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు..? అంటూ ప్రతి దానికి కంపారిజన్ చేస్తూనే వస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కంపారిజన్ ఎక్కువైపోయింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా కంపారిజన్ చేస్తూ కొంత మంది స్టార్స్ ని ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా గతంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరోస్ ఎలా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించారు ..? ఎలాంటి సినిమాలను ఓకే చేశారు..?



ఇప్పుడు ఎందుకు ఆ విధంగా స్టార్ యంగ్ హీరోస్ చేయలేకపోతున్నారు అని మాట్లాడుకుంటున్నారు . కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోస్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ గతంలో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేసేవారు అందరికీ తెలిసిందే . అది యాక్షన్ కాదు .. మాస్ కాదు .. మెసేజ్ ఓరియెంటెడ్ కాదు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాదు అన్ని రకాల పాత్రలను టచ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు హీరోస్ మాత్రం కేవలం రొమాంటిక్ భారీ బడ్జెట్ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు.

 

ఎక్కడా కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు.  ఈ మధ్యకాలంలో ఒక్కటంటే ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో కూడా ప్లాండ్ గా హీరో నటించిన సందర్భాలు దాఖలాలు లేవు . ఆ కారణంగానే సోషల్ మీడియాలో జనాలు యంగ్ హీరోస్ కి స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు.  ఎప్పుడు పాన్ ఇండియా మాస్ సినిమాలే కాదు జనాలను ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను ఓకే చేయండి.  సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఎలా జనాలను కడుపుబ్బ నవ్వించాడు అందరికీ తెలుసు.  అలాంటి మూవీస్ చూస్ చేసుకుంటే యంగ్ హీరోస్ ఖాతాలో కూడా హిట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: