
డేరింగ్ డైరెక్టర్ పూరి కథకు.. ఈసారి అంత సీనుందా..?
కథలు అందరి దగ్గర ఉంటాయి .. అదే విధంగా పూరి జగన్నాథ్ దగ్గర కూడా ఉన్నాయి కానీ ఆయనకు ఛాన్స్ ఇచ్చేది ఎవరు అన్న ప్రశ్న అందరిలో ఉంది .. మొన్నటి వరకు గోపీచంద్ తో కలిసి సినిమా చేస్తున్నడు అంటూ వార్తలు వచ్చాయి . కానీ దీనిపై కూడా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. ఇక ఇప్పుడు సీనియర్ హీరోల వైపు చూస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సీనియర్ హీరోల్లో చిరంజీవి దగ్గరికి పూరి వెళ్లే అవకాశం లేదు .. ఇప్పటికి ఆటో జానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది .. మరో కథతో కలుద్దాం అన్నా కూడా చిరంజీవి బిజీగా ఉన్నారు .. వెంకీ , పూరి కాంబినేషన్ కూడా కష్టమే ఇద్దరికీ ఎక్కడ సింక్ అవ్వడం లేదు .
అయితే ఈ లిస్టులో నాగార్జున , బాలకృష్ణ ఉన్నారు .. బాలకృష్ణ దగ్గర పూరి జగన్నాథ్ కు ఓపెన్ ఆఫర్ ఉంది .. ఎప్పుడైనా బాలయ్యతో ఈయన సినిమా చేసుకోవచ్చు . ఆ బెటర్ ఆప్షన్ కంటే ముందు ఇంకేదైనా ట్రై చేయాలని పూరి భావిస్తున్నట్టు తెలుస్తుంది . నాగార్జున , పూరి కలిస్తే బాగుంటుంది.. గతంలో వీళ్ళిద్దరిది హిట్ కాంబినేషన్ .. కాకపోతే ఇప్పుడు మార్కెట్ , బడ్జెట్ లెక్కలు చూసుకుంటే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు .. దీనిబట్టి పూరి దగ్గర కథలు రెడీగా ఉండొచ్చు కానీ ఓ హీరోని పట్టుకొని అతనితో హిట్ కొట్టడం అనేది ఈసారి పూరికి అంత ఈజీ టాస్క్ కాదని అంటున్నారు . మరి ఈ డేరింగ్ డైరెక్టర్ ఏం చేస్తారో చూడాలి.