దిల్ రాజు పాన్ ఇండియా మూవీ అయినటువంటి గేమ్ ఛేంజర్ ని తీసి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుదాం అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో దిల్ రాజు బొక్క బోర్లా పడ్డాడు. కానీ మళ్ళీ ఆయనకు పాన్ ఇండియా మూవీ పై ఇంట్రెస్ట్ కలుగుతున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే జటాయు అనే సినిమాని స్టార్ హీరోతో తీయాలి అని దిల్ రాజు ఆలోచన చేస్తున్నారట. అయితే గతంలో ఆయన శైలేష్ కొలను, ప్రశాంత్ నీల్, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి డైరెక్టర్లతో సినిమాలు తీయాలి అనుకున్నారు. అలా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో రావణం మూవీ రాబోతోంది.అలాగే విశ్వంభర మూవీకి శైలేష్ కొలను అనుకున్నప్పటికీ డైరెక్టర్ చేంజ్ అయి వశిష్ట ఈ ప్రాజెక్టులో చేరారు. ఇక ఈ రెండు ఒకే కానీ ఇంద్రగంటి మోహనకృష్ణతో జటాయు మూవీ ని విజయ్ దేవరకొండ హీరోగా పెట్టి తీయాలి అనుకున్నారు. కానీ ఎందుకో ఆ హీరోని పక్కన పెట్టి దిల్ రాజు ఈ సినిమాలో వేరే హీరోని తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక విషయంలోకి వెళ్తే.. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో జటాయు అనే మూవీని విజయ్ దేవరకొండతో అనుకున్నప్పటికీ వీరిద్దరినీ పక్కనపెట్టి హీరోగా ప్రభాస్ ని డైరెక్టర్ గా త్రివిక్రమ్ ని తీసుకొని జటాయు మూవీ మొదలు పెట్టాలి అని దిల్ రాజు ఆలోచన చేస్తున్నారట. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ అవుతుంది. ఇక ప్రభాస్ కూడా వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ ఎలా అయినా డేట్స్ కుదిరించి ప్రభాస్ త్రివిక్రమ్ కాంబోలో జటాయు మూవీని తీసుకురావాలి అని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారట. దీంతో జటాయు సినిమా గురించి ప్రభాస్ త్రివిక్రమ్ కంబో గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.ఇక ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టడంతోనే చాలామంది ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు.
ఇప్పటికే ప్రభాస్ కల్కి వంటి మైథలాజీకల్ సినిమాలో చేశారు.మళ్లీ జటాయు వంటి మైథలాజికల్ సినిమా అంటే భారీ హోప్స్ పెట్టుకోవాల్సిందే.అలాగే దిల్ రాజు పాన్ ఇండియా ఆశలపై గేమ్ ఛేంజర్ మూవీ నీళ్లు చల్లడంతో మళ్లీ ప్రభాస్ పై తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రభాస్ తో జటాయు మూవీ నిర్మించి ఎలా అయినా పాన్ ఇండియా నిర్మాతగా రాణించాలి అని దిల్ రాజు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రభాస్ త్రివిక్రమ్ కాంబోలో జటాయు మూవీ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టడం ఖాయం. ఎందుకంటే త్రివిక్రమ్ కి మైథలాజికల్ సినిమాల పైన మంచిపట్టు ఉంటుంది. అలాంటి డైరెక్టర్ తో ఈ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకి దిల్ రాజు 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.మరి చూడాలి వీరి కాంబోలో జటాయు మూవీ వస్తుందా లేదా అనేది..