రెండోసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.?

frame రెండోసారి తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.?

Pandrala Sravanthi
 ఏంటి నిజంగానే ఆ హీరోయిన్ రెండోసారి తల్లి కాబోతుందా.. ఆమె మాట్లాడిన మాటల్లో నిజం ఎంత.. నిజంగానే మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం..మరి ఇంతకీ రెండోసారి తల్లి కాబోతుంది అని వార్తల్లో ఉన్న ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇప్పటికే అలియా భట్ రన్బీర్ కపూర్ దంపతులకు రాహ అనే పాప ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరికి పెళ్లయిన ఏడు నెలలకే పాప పుట్టడంతో చాలా విమర్శలు వచ్చాయి. కానీ విమర్శలను పక్కనపెట్టి ఈ జంట తమ పాపతో కలిసి ఆనందంగా గడుపుతుంది. అయితే తాజాగా రెండో బిడ్డపై కూడా రన్బీర్ కపూర్ అలియాభట్ దంపతులు హింట్ ఇచ్చేశారు. అయితే రీసెంట్గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆలియా భట్ తమ రెండో బిడ్డకు సంబంధించి చిన్న హింట్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.


అలియా భట్ ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. నాకు కూతురు పుడితే ఈ పేరు కొడుకు పుడితే ఈ పేరు పెట్టాలి అని ముందుగానే ఫిక్స్ అయ్యాను. అలాగే మా కూతురికి రాహా అనే పేరుని పెట్టమని మాకు సజెస్ట్ చేసింది మా అత్తగారే.మా అత్తగారు చెప్పడం వల్లే రాహా అనే పేరును పెట్టాం. అలాగే మాకు కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలో కూడా అది ముందుగానే నిర్ణయించుకొని పెట్టుకున్నాం. మాకు కొడుకు పుడితే అదే పేరు పెట్టుకుంటాం అంటూ అలియా భట్ మాట్లాడింది.అయితే అలియా భట్ మాటలు విన్న నెటిజెన్లు అలియా భట్ రన్బీర్ కపూర్ లు మళ్ళీ పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది.కొంతమంది నటినటులు పిల్లలు ఒకరితో చాలు అనుకుంటే వీళ్ళు మాత్రం రెండో బిడ్డని కనడానికి కూడా చాలా ఆసక్తి కనబరిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మరి అలియా భట్ ఆ పాడ్ కాస్ట్ లో రెండో బిడ్డకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ మాట్లాడింది అంటే నిజంగానే ఆమె తల్లి కాబోతుందా అని కొంతమంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో అలియా భట్ రన్బీర్ కపూర్లు మళ్ళీ బిడ్డను కనడానికి రెడీగా ఉన్నారు. కానీ వారసుడే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మొదట పాప పుట్టింది కాబట్టి ఇప్పుడు కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అలియా భట్ రన్బీర్ కపూర్ దంపతులు నిజంగానే పేరెంట్స్ కాబోతున్నారా..లేక పుట్టబోయే బిడ్డకు సంబంధించి ఇలా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: