భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్న స్టార్ హీరోయిన్లు ఎవరు అంటే .. వారు ఎంతో ఫేమస్..?

Amruth kumar
ఇక మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లుగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న భామ‌లు తమ సినిమా జీవితం కంటే వ్యక్తిగత జీవితాన్ని ఎంతో భిన్నంగా కలిగి ఉంటారు .. సినిమాలో ఎంతో పద్ధతిగా ఉంటే నిజ జీవితంలో మాత్రం భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం గడుపుతుంటారు . ఇలా సినీ జీవితం నిజ జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది .. ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు ..వారికి  సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.


శృతి: కన్నడ చిత్ర పరిశ్రమలో 1990 ల నుంచి గత రెండు సంవత్సరాల క్రితం వరకు బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా కాటేరా .. ఈ సినిమాలో గొప్పన్నటిగా మంచి ముద్ర వేసుకున్న శృతి .. ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది .. ఈమె దర్శకుడు మహేంద్రను మొదట పెళ్లి చేసుకుంది .. తర్వాత న్యాయవాది చంద్ర చుడ్‌ను రెండో పెళ్లి చేసుకుంది .. అయితే ఈ ఇద్దరికి కూడా విడాకులు ఇచ్చేసింది. చంద్రిక: కన్నడ చిత్ర పరిశ్రమలో 1985లో విడుదలైనపుట్టణ్ణ కణగాల్ వారి మసణద హూవు  సినిమా నుంచి 2015 లో విడుదలైన కెండసంపిగె సినిమా వరకు వివిధ  పాత్రలో నటిస్తూ 30 సంవత్సరాలు చిత్ర పరిశ్రమ లో జీవితం గడిపిన చంద్రిక . గత చాలా సంవత్సరాలుగా తన భర్త నుంచి దూరంగా ఉంటూ ఒంటరిగా గడుపుతుంది .. కన్నడ బిగ్ బాస్ సీజన్ వన్ లో కూడా పాల్గొంది.


నిధి సుబ్బయ్య: కర్ణాటకలోని కొడగుకు చెంది నిధి సుబ్బయ్య మోడలింగ్ ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. 2009 నుంచి నటిగా సిని జీవితం ప్రారంభించి .. ప్రస్తుతం ఇంకా సినిమాల్లోనే కొనసాగుతుంది .. నిధి కూడా తన స్నేహితుడు వ్యాపారవేత్త లవేష్ ఖైరాజనిని 2017 లో పెళ్లి చేసుకుంది ..  కానీ అతను నుంచి కేవలం సంవత్సరం వ్యవధిలోనే అంటే 2018 లో విడాకులు తీసుకుంది .. ఈమె కూడా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. సోను గౌడ: కన్నడ చిత్ర‌ పరిశ్రమలో 2008 లో ఇంతి నిన్న ప్రీతియ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు .. ఈమె 2010 లో పెళ్లి చేసుకున్నారు .. కానీ పెళ్లి తర్వాత భర్త మనోజ్ కుమార్ నుంచి దూరమయ్యారు .. తర్వాత తన చెల్లి పెళ్లిని ఘనంగా చేశారు. ఈమె మాత్రం ఒంటరిగా ఉంటుంది. .



జాన్వి: తమిళనాడులో న్యూస్ లీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన జాన్వి .. తర్వాత కన్నడ ఇండస్ట్రీలో పలు టీవీ షోల్లో పాల్గొని భారీ క్రేజ్ తెచ్చుకుంది .. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది .. కన్నడ బిగ్ బాస్ షో విన్నర్ రూపేష్ శెట్టికి జోడిగా అధిపత్రా సినిమాలో నటించారు .. ఈమె కూడా భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదు . త్వరలోనే ఈమెకు కూడా భర్త నుంచి అధికారం గా విడాకులు వస్తాయని అంటున్నారు. నివేదిత గౌడ: బిగ్బాస్ షో కంటెస్టెంట్ గా వెళ్లిన సోషల్ మీడియా సుందరి నివేదిత గౌడ కన్నడ బుల్లితెర ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు .. కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తనతో కలిసి పోటీకి వెళ్లిన ర్యాపర్ చందన్ శెట్టిని పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది .. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమం  విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న అగ్ర నటీమణులు వేరే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: