మైండ్ బ్లాక్ అయ్యే టైటిల్.. ' రుద్ర ' గా మహేష్ బాబు.. !

frame మైండ్ బ్లాక్ అయ్యే టైటిల్.. ' రుద్ర ' గా మహేష్ బాబు.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . . .
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా మీద ప్రపంచం మొత్తం దృష్టి ఉంది. మ‌హేష్ బాబు కెరీర్ లో 29వ సినిమా ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు. ఆఖరికి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ అయిందన్న విషయం కూడా మీడియాకు చెప్పలేదు. కాకపోతే .. ఇన్సైడ్ వర్గాల ద్వారా ఒక విషయం బయటకు వస్తోంది. తాజాగా .. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఓ లీక్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర గా కనిపిస్తాడట. అది తన పాత్ర పేరు. గుంటూరు కారంలో.. రమణ, ఖలేజాలో.. సీతారామరాజు, అతడులో.. పార్ధు, పోకిరిలో.. పండు ఇలా మహేష్ సినిమా టైటిల్స్ కాదు.. తన క్యారెక్టర్ పేరులోనూ మన యూనిక్ నెస్ ఉంది.

మరి రుద్రని.. మహేష్ ఫ్యాన్స్ ఎంత వరకు ? ఓన్ చేసుకుంటారో చూడాలి. ఇటీవల హైదరాబాద్ లోనే అల్యూమినియం ఫ్యాక్టరీ లో 12 రోజులపాటు షూటింగ్ చేసి కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ షూటింగ్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు .. నానాపటేకర్ కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని కూడా టీం బయటకు రానివ్వటం లేదు. కొత్త షెడ్యూల్ ఒరిస్సాలోని కోరాఫుట్ అడవులలో ప్రారంభమైందని తెలుస్తోంది. అక్కడ మరో 15 రోజులు పాటు షూటింగ్ జరుగుతుందట. ఈ సినిమా కోసం గరుడ అనే టైటిల్ పేరు పరిశీలనలో ఉంది. అయితే.. పాన్ వరల్డ్ సినిమా కావడంతో ఇంగ్లీష్ టైటిల్ కోసం నిర్మాతలు వాళ్ళ పేర్లు పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమా ను 2026 చివ‌ర్లో లేదా 2027 లో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: