
అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి బంధానికి 14 ఏళ్ళు.. లవ్ మ్యారేజ్ హైలెట్స్ ఇవే.. !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి తాజాగా 14వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. . లవర్ బాయ్ అల్లు అర్జున్ తొలిచూపులోనే స్నేహ రెడ్డి తో ప్రేమలో పడిపోయారు. అమెరికాలో జరుగుతున్న ఒక శుభకార్యానికి బన్నీ వెళ్లారు. అక్కడ స్నేహను చూసి ప్రేమలో పడిపోయాడు. అందరిలాగా ఇద్దరి ఇంట్లోను పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ ... బన్నీ, స్నేహ మాత్రం.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని చెప్పడంతో .. . ఇరువైపులా కుటుంబ పెద్దలు కాస్త ఆలోచించారు. చివరికి పిల్లలు ప్రేమను అర్థం చేసుకొని పెద్దలు దిగివచ్చి సంప్రదింపులు జరిపారు. 2010 నవంబర్ 26న ఘనంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత మూడు నెలలకు 2011 మార్చి 6న వివాహ బంధంతో వీరిద్దరూ ఒకటయ్యారు. టాలీవుడ్‌లో బన్నీ పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, స్నేహ దంపతులకు కుమారుడు అల్లు అయన్ తో పాటు . . ముద్దుల కూతురు అర్హ ఉంది.
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు.. కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వీరి స్వస్థలం నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం. ఇక ఈ కుటుంబం గత కొనేళ్లు గా హైదరాబాద్‌లో సెటిల్ అయింది. పెళ్లి కాక ముందు అల్లు స్నేహారెడ్డి తన తండ్రికి ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల బాధ్యతలను చూడడంతో పాటు .. వ్యాపారాలలో తండ్రికి చేదోడు వాదుడుగా ఉండేవారు. ఇక స్నేహతో ప్రేమలో పడిన విషయాన్ని బన్నీ ముందుగా తన తల్లికి తెలిపాడట. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అల్లు అర్జున్ తల్లి ఇంట్లో వాళ్ళు అందరిని ఒప్పించిందట.