బన్నీవిదేశీ ట్రిప్ వెనుక‌ .. అసలు కారణం ఇదేనా ..?

RAMAKRISHNA S.S.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరియర్లో ఊహించని రేంజ్ కు తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు .. పుష్ప2 గ్రాండ్ సక్సెస్ తర్వాత తన సినిమాల విషయంలో ఊహించని రేంజ్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .. పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్‌ చేయడంతో పాటు అల్లు అర్జున్ ఫాలోయింగ్ కూడా భారీగా పెంచేసింది .. ఇంతటి విజయం తర్వాత విదేశాలకు వెళ్లడం అందరిలో అనేక అనుమానాలను పెంచుతుంది .. అయితే అందుకు అసలు కారణం .. ఈసారి బన్నీ మరింత ప్రిపరేషన్ తో మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట .


తన కెరీర్‌ను కొత్త మూడ్లో పెట్టాలని ఉద్దేశంతోనే బన్నీ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది .. ఫిట్నెస్ , యాక్టింగ్, మైండ్ పీస్ ఫుల్ నెస్ వంటి అంశాల్లో మరింత ప్రొఫెషనల్ గా ఉండడానికి ఆయన కొన్ని స్పెషల్ కోర్సులు చేస్తున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తుంది .. ముఖ్యంగా యూరప్ లో ప్రఖ్యాత వెల్సన్ సెంటర్లో మెడిటేషన్ మానసిక స్థైర్యాన్ని పెంచుకునే ఫిట్నెస్ను నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది .. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ లో ఎప్పుడు ముందుండే బన్నీ ఈసారి మెంటల్ ప్రిపరేషన్ పై కూడా దృష్టి పెట్టడం మరింత ఆసక్తిగా మారింది . ఇవే కాకుండా తన నెక్స్ట్ సినిమాలకు ముందు  పూర్తిగా సిద్ధంగా ఉండటానికి ఈ శిక్షణ తీసుకుంటున్నడట ..


అలాగే పుష్ప రాజ్‌లుక్  కోసం రెండేళ్లగా ఒకే తరహాలో  అల్లు అర్జున్ ఉండాల్సి వచ్చింది .. ఇప్పుడు తను చేసే తర్వాత సినిమాలకు పూర్తిగా ఫ్రెష్ గా మారే ప్రయత్నం కూడా చేస్తున్నాడు .. అదే విధంగా సంధ్య థియేటర్ కోర్టు కేసు వ్యవహారాలతో మానసిక ఒత్తిడికి గురైన బన్నీ అందులో నుంచి బయటపడే ప్రయత్నం గా కూడా ఈ ట్రిప్ ను ప్లాన్‌ చేసుకొని ఉంటాడని ఊహగానాలు వస్తున్నాయి . ప్రస్తుతం త్రివిక్రమ్ , అట్లీ దర్శ‌కుల‌తో సినిమా చర్చలు జరుపుతున్నాడు అల్లు అర్జున్ .. ఏ సినిమా ముందు మొదలు పెడతారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ .. 2026 నాటికి రెండు సినిమాలు కంప్లీట్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్.  అలాగే అంతర్జాతీయంగా తన క్రేజీ పెంచుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ .. హాలీవుడ్ స్టైల్ లో ప్రిపరేషన్ మొదలుపెట్టినట్టు ఫిలిం వర్గాల్లో వార్తలు వస్తున్నాయి .. ఈ ట్రిప్ వల్ల బన్నీలు ఎలాంటి మార్పులు వస్తాయనేది ఇప్పుడు అందరిలో హాట్‌ టాపిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: