చిరంజీవి , పవన్ , మహేష్ అందుకోలేక పోయారు .. నితిన్ చేసి చూపించాడుగా.. అది ఏంటంటే..?
నాటి రాఘవేందర్రావు నుంచి నేటి రాజమౌళి వరకు తెలుగులో ఉన్న అగ్రదర్శకులు అందరితోనూ వర్క్ చేసిన ఘనత నీతిన్‌కే సొంతం .. ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు రాజమౌళి , త్రివిక్రమ్ , పూరి జగన్నాథ్ , వివి వినాయక్ .. ఈ నలుగురు దర్శకులతో వర్క్ చేసిన హీరో నితిన్ .. టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఈ నలుగురిలో కేవలం ముగ్గురితో మాత్రమే పని చేశారు .. రామ్ చరణ్ ని తీసుకోండి రాజమౌళి , పూరి , వినాయక్ తో సినిమాలు చేశాడు .. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ , పూరి , వినాయక్ తో సినిమాలు చేశాడు .. ప్రభాస్ రాజమౌళి , పూరి , వినాయక్ తో వర్క్ చేశాడు.
అయితే ఈ లిస్టులో ఎన్టీఆర్ మాత్రమే నితిన్ రికార్డును బద్దలు కొట్టాడు .. అయితే అది 2018 తర్వాతే ఎన్టీఆర్ ఖాతాలోకి ఆ రికార్డు వచ్చి పడింది .. అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ లిస్టులో చేరిపోయాడు .. ఇక దానికి ముందు పూరి జగన్నాథ్ , వినాయక్ , రాజమౌళితో సినిమాలు చేశారు ఎన్టీఆర్ .. కానీ నితిన్ మాత్రం కెరియర్ మొదట్లోనే వినాయక్ తో దిల్.. రాజమౌళితో సై సినిమాలు చేశాడు .. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో హార్ట్ ఎటాక్, త్రివిక్రమ్ తో ఆ ఆ సినిమాలు చేశాడు .. అయితే ఈ లిస్టులోకి ఎన్టీఆర్ వచ్చేవరకు ఈ రికార్డు నితిన్ ఖాతాలోనే ఉంది .. అలాగే కృష్ణవంశీ , రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుల తోను .. ఎన్టీఆర్ అటు నితిన్ సినిమాలు చేశారు .. ప్రజెంట్ కెరీర్ లో కాస్త వెనుక పడ్డాడు కానీ ఇప్పటికీ నితిన్ టాప్ డైరెక్టర్స్ తోనే పని చేస్తున్నాడు.