మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది “దేవర” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. 'ఎన్టీఆర్ నీల్' అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని తెలుస్తుంది... ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం,
'NTRNeel” మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ చిత్రంగా నిలువనుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.లొకేషన్‌లోని ఓ ఫొటోని షేర్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్, దేవర వంటి వరుస సక్సెస్ ల తర్వాత హీరో ఎన్టీఆర్ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఊహించని క్రేజ్ ఏర్పడింది..అలాగే 'కేజీఎఫ్, సలార్' వంటి వరుస విజయాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
దేవర సినిమా తర్వాత, ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రం కోసం మేకర్స్ ఏకంగా రూ.360 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది... హిందీ లో సైతం ఎన్టీఆర్ మార్కెట్ విస్తరించబోతున్నట్లు సమాచారం..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ క్యూట్ బ్యూటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..ప్రశాంత్ నీల్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమాను కూడా ప్రశాంత్ రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..