పూరి జగన్నాథ్ - గోపీచంద్ సినిమా కొనేది ఎవరు..?

frame పూరి జగన్నాథ్ - గోపీచంద్ సినిమా కొనేది ఎవరు..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక టైం లో స్టార్ హీరోలు అందరూ పూరితో సినిమా చేసేందుకు క్యూ కట్టేవారు. పూరితో ఒక్క సినిమా పడితే చాలు.. తమ లైఫ్ టర్న్ అవుతుందని భావించేవారు. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ నుంచి ఆ తర్వాత తరం స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో కూడా పూరి జగన్నాథ్ సినిమాలు చేశారు.


నితిన్, రామ్, గోపీచంద్ లాంటి హీరోలతో కూడా సినిమాలు చేశారు పూరి. రవితేజ తో కూడా మంచి హిట్ సినిమాలు తెర‌కెక్కించారు. అలాంటి పూరీ.. గత కొద్దిరోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా వ‌రుస డిజాస్టర్ సినిమాలు తీస్తున్నారు. అటు హీరో గోపీచంద్ కూడా సరైన హిట్ కొట్టి పద్దేళ్ళు దాటుతుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న సినిమాలు.. అటు గోపీచంద్ చేస్తున్న సినిమాలు . . జనాలకు బోర్ కొట్టేసాయి. మ‌రి వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేసినా ఎవ‌రు మాత్రం చూడాల‌ను కుంటారు.


ఇద్దరు కొత్తగా ఆలోచించడం లేదు. కొత్త సినిమాలు చేయడం లేదు. అసలు పూరి జగన్నాథ్ - గోపీచంద్ సినిమాను కొనుక్కున్న వారు కోట్లకు కోట్లు నష్టపోయి కుద్దేలైపోతున్నారు. అలాంటి టైం లో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై కూడా టాలీవుడ్ వర్గాలలో ఏమాత్రం ఆసక్తిగా లేదు. అందుకే వీరిద్దరితో సినిమాలు చేసిన ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది బయ్యర్లు.. ఆర్థికంగా నష్టపోయారు. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే పెద్దగా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: