ఈ కాంబినేషన్లలో సినిమాలు రావడం సాధ్యమేనా.. ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారుగా!
గోపీచంద్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వినిపిస్తుండగా ఈ కాంబినేషన్ ఎప్పటికీ సాధ్యమవుతుందో చూడాలి. పూరీ జగన్నాథ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిందేననే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
చిరంజీవి హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా అంటూ వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చిరంజీవి బాబీ కాంబినేషన్ గురించి కూడా వార్తలు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. కాంబినేషన్లు క్రేజీగా ఉంటున్నా సినిమాలు ఆలస్యం కావడం సినీ అభిమానులను ఒకింత బాధ పెడుతోందని చెప్పవచ్చు.
వేర్వేరు కారణాల వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లడం లేదని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే బ్యానర్ల సంఖ్య సైతం అంతకంతకూ తగ్గుతోంది. పెద్ద సినిమాలు భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం కూడా ఇందుకు సంబంధించి ఒక కారణం అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2025లో మిశ్రమ ఫలితాలు దక్కుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం, పూరీ జగన్నాథ్ కమ్ బ్యాక్ కోసం, హరీష్ శంకర్ సక్సెస్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.