సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఎనలేని క్రేజ్‌ను అందుకుని స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుంటారు. అయితే, ఆరంభంలోనే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకునే వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో శ్వేతా బసు ప్రసాద్ ఒకరు. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. ఎన్నో వివాదాల కారణంగా సినిమాలకు దూరమైందామె.ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ నటించిన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరిచయం అయింది.కొత్త బంగారు లోకం' తర్వాత తెలుగులో 'కాస్కో', 'కళావర్ కింగ్', 'రైడ్', 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, అవేమీ ఆమెకు విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. అప్పటి నుంచి తమిళం, హిందీ చిత్రాల్లోనే నటించింది. అంతేకాదు, బుల్లితెరపై వచ్చిన ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగమై పాపులరిటీ పెంచుకుంది.
కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో ఓ కేసులో చిక్కుకుంది శ్వేతా బసు ప్రసాద్. అప్పట్లో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అప్పుడు ఆమెను పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు.
ఆ సమయంలో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ ఈ హీరోయిన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో అవకాశాలు రాక సినిమాలకు దూరమైంది.ఇదిలావుండగా శ్వేతా బసు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయం లో తన ఎత్తును గుర్తుచేస్తూ సెట్ లోని వారు ఎగతాళి చేసినట్లు తెలిపారు. హీరో దాదాపు 6ఫీట్లు ఉండడంతో ఇలా జరిగిందన్నారు.చాలా సీన్లు రీ టేక్ చేసారని చెప్పారు.చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను అందుకుని.. ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలు.. ఇలా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది శ్వేతా బసు ప్రసాద్. ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా చవి చూసింది. దీంతో మరోసారి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్నారు.