
సొంతగడ్డపై రష్మికకు వ్యతిరేకత.. కారణం ఇదే!
అయితే ఇటీవల రష్మిక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబాయికి వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'హైదరాబాద్ నుండి వచ్చిన నన్ను ఇంతగా ఆదరిస్తూ.. ప్రేమాభిమానలను చూపిస్తున్న ప్రేక్షకులను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు తన సొంతగడ్డ కన్నడ నుంచి వ్యతిరేకతని తీసుకొచ్చి పెట్టాయి. రష్మికపై కన్నడ వాసులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. 'కన్నడలో ఉండే విరాజ్ పేట్ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చింది.. ఈ విషయం మాకు తెలీదు. వేరే ప్రాంతాలకు వెళ్లక సొంతూరు గురించి చెప్పడానికి వచ్చే సమస్య ఏంటి' అంటూ మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈమె నటించిన పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.