ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్
ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్
మూవీ గత ఏడాది
డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. గతంలో వచ్చిన
బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ
సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి
బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది.. ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ
సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టారు.. అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 భారీ హిట్ అయింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి
చరిత్ర సృష్టించింది.. అంతా బాగానే వున్నా పుష్ప 2 సినిమాకు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన షాక్ ఇచ్చింది.. ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో పుష్ప 2 టీం ఒక్కసారిగా షాక్ అయింది.. అల్లుఅర్జున్ ని
అరెస్ట్ కూడా చేయడంతో విషయం పీక్స్ కి వెళ్ళింది..
బెయిల్ మీద రిలీజ్ అయ్యాక
అల్లు అర్జున్ సంతోషంగా ఉన్నట్లు కనిపించింది లేదు.. పైగా తాను ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయిపోతున్నాయి.. దీనితో అప్పటి నుంచి ఎలాంటి ఫంక్షన్ కి హాజరవ్వాలి అన్నా అల్లుఅర్జున్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.. తాజాగా పుష్ప 2
సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో మేకర్స్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు..
ఈ థాంక్స్ మీట్ లో అల్లుఅర్జున్,
సుకుమార్ లు పాల్గొన్నారు..
అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ
సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా
సుకుమార్ దే అని చెప్పారు..తాను ఇంతగొప్పగా నటించేందుకు అసలు కారణం సుకుమారేనని అల్లుఅర్జున్ తెలిపారు.. దీనితో ఎమోషనల్ అయిన
సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి
బన్నీ ని హగ్ చేసుకున్నారు..డార్లింగ్ నువ్వు ఎమోషనల్ అవ్వకు నేను ఎమోషనల్ అవుతా ప్రతీ
ఈవెంట్ లో ఏడిస్తే బాగోదు అని చెప్పాడు..