అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న శింబు.. ఏకంగా ఆ నలుగురు దర్శకులతో సినిమాలు..?

frame అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న శింబు.. ఏకంగా ఆ నలుగురు దర్శకులతో సినిమాలు..?

Pulgam Srinivas
తమిళ నటుడు శింబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే శింబు తను నటించిన చాలా సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో మన్మధ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఈయనకు ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. దానితో ఈయన కు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే శింబు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సినిమాలను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పటికే శింబు తన తదుపరి నాలుగు మూవీ లను సెట్ చేసుకున్నాడు. ఆ నాలుగు మూవీ లు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తగ్ లైఫ్ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శింబు ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే శింబు , రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అలాగే దేసింఘ్ పెరియసమి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే అశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కూడా శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ఈయన తన తదుపరి నాలుగు మూవీలను సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: