టాలీవుడ్ స్టార్ హీరోలకు ఎదురు వెళుతున్న దుల్కర్.. ఈసారి వర్కౌట్ అయ్యేనా..?

frame టాలీవుడ్ స్టార్ హీరోలకు ఎదురు వెళుతున్న దుల్కర్.. ఈసారి వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో నటించి నటించిన ప్రతి తెలుగు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన మొదటగా తెలుగులో మహానటి అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన తెలుగులో సీత రామం అనే సినిమాలో హీరో గా నటించాడు.


ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుందు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఈయన నటించిన మూడు తెలుగు సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకోవడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం ఈయన కాంత అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు భాషలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మే నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మే 9 వ తేదీన రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర సినిమా విడుదల కానుంది. అలాగే చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని కూడా మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలా సినిమాలు విడుదల కానున్న సమయం లోనే దుల్కర్ సల్మాన్ తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: