సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కెరియర్ ప్రారంభం నుండి అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు దక్కడం వారు చాలా త్వరగా స్టార్ హీరోయిన్ కావడం జరిగిపోతూ ఉంటుంది. వారి కెరియర్ బిగినింగ్ నుండి స్టార్ హీరోయిన్ అయ్యే వరకు పెద్దగా ఆటు పోట్లు ఏమీ ఉండవు. కానీ కొంత మంది స్టార్ హీరోయిన్లకు మాత్రం కెరియర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ తర్వాత మంచి అవకాశాలు రావడం , వారు నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారు కూడా ఉంటారు.
అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దసరా దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... ఇందులో కాజల్ అగర్వాల్ పాత్రకు మొదటగా రకుల్ ని ఎంపిక చేసుకున్నారు. అందులో భాగంగా ఆమెపై కొన్ని రోజుల షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. కొంత భాగం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆమె ఆ పాత్రకు సెట్ కాదు అని ఉద్దేశంతో ఆమెను ఆ సినిమా నుండి తీసేసారు. దానితో ఆమెకు ఆ సినిమా తర్వాత మరో అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది.
కానీ ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమెకు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు రావడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తుంది.