SSMB :హీరోయిన్ గా ప్రియాంకనే ఎంచుకోడానికి అసలు కారణం అదేనా..?

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 29. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలావుండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ ఈ సినిమా లో నయా లుక్ లో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు ఈ సినిమా లో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మహేష్ కోసం ప్రియాంక హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. మొదట్లో విదేశీ నటి ఈ సినిమా లో చేస్తుందని టాక్ వినిపించింది. ఆతర్వాత దీపికా పదుకొనె పేరు కూడా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేశారు.అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లానే వేశారని టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. దీనిని రాజమౌళి టీమ్ ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్టు సమాచారం. నాటునాటు పాటకు ఆస్కార్ రావడం కోసం ప్రియాంక చాలానే కష్టపడ్డారని తెలుస్తోంది. ఆస్కార్ కోసం ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని సమాచారం.

SSMB29లో ప్రియాంకను తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆమె ఏజెన్సీ అంత కష్టపడితే.. స్వయంగా తను నటించిన సినిమా అయితే ఈజీగా పుష్ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. సినిమా ఆస్కార్‌కు వెళ్లడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం హాలీవుడ్‌లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో SSMB29కి కూడా క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో ప్రియాంకను భాగం చేశారని టాక్.
ఇక ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నడుస్తుంది. ఈ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ కెన్యా అడవుల్లో కూడా చేయనున్నారని సమాచారం. అలాగే ఈ కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: