ఈ మధ్య కాలంలో ఏదైనా స్టార్
హీరో సినిమా విడుదల అయ్యింది అంటే ఆ
సినిమా 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే దాన్ని బ్లాక్ బాస్టర్ సినిమాగా , అద్భుతమైన సినిమాగా జనాలు పరిగణిస్తున్నారు. దానితో స్టార్ హీరోల సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తాయా లేదా అని ఆ
హీరో అభిమానులు ,
ఇండస్ట్రీ కూడా చాలా వరకు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో
ప్రభాస్ హీరోగా రూపొందిన రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే ,
షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి.
ఇకపోతే ఒక
హీరోయిన్ నటించిన మూడు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి. ఆ
బ్యూటీ మరెవరో కాదు దీపికా పదుకొనే. ఇప్పటి వరకు
ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ
హీరోయిన్ నటించిన మూడు సినిమాలు కూడా వెయ్యి కోట్ల కలెక్షన్లను వసూలు చేయలేదు. దీపికా పదుకొనే కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.
ఇక ఆ తర్వాత ఈ
బ్యూటీ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన
జవాన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ కూడా వెయ్యి కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే కొంత కాలం క్రితం
ప్రభాస్ హీరోగా రూపొందిన
కల్కి 2898 AD సినిమాలో
దీపిక ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
సినిమా కూడా వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇలా దీపికా నటించిన పటాన్ ,
జవాన్ ,
కల్కి 2898 AD సినిమాలు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి.