
వావ్: మోక్షజ్ఞకు జంటగా ఆ స్టార్ హీరోయిన్ కూతురా..?
మోక్షజ్ఞ ఫోటోషూట్లు కూడా విడుదల అవ్వగా ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోవడం జరిగింది. మోక్షజ్ఞ సరసన హీరోయిన్ ఎవరనే విషయం పైన కూడా ఇటివలే చిత్ర బృందం లుక్ టెస్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో శ్రీలిల తో పాటుగా చాలామంది అమ్మాయిల పేర్లు కూడా వినిపించాయి. అయితే చివరికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన బడా హీరోయిన్ కూతురిని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు రవీనా టాండన్ కూతురు రషాతాడని.
ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. చిత్ర బృందం మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ఎక్కడ తెలియజేయలేదు. సరైన ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రషా తడాని విషయానికి వస్తే.. ఈమె బాలీవుడ్లో అగ్ర నిర్మాత కూతురిగా కూడా పేరుపొందింది. అలాగే ఈమె తల్లి కూడా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటుగా ఇటీవల ఈమె ఆజాద్ అనే ఒక సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందట. ఇందులో అజయ్ దేవగన్ కూడా నటించారు.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈమె అందంతో నటనతో మెప్పించిందట.