నందమూరి
బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, పవర్ఫుల్ డైలాగ్స్ తో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నేటి తరం యువతకి
బాలయ్య బాబు డైలాగ్స్ అంటే విపరీతంగా ఇష్టం.
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ
సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్
సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో
బాలయ్య ఎప్పటిలాగే తనదైన నటనతో అభిమానులను అలరించి మెప్పించాడు. డాకు మహారాజ్ సినిమాలో
బాలయ్య బాబు సరసన హీరోయిన్లుగా శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైష్వాల్ నటించారు. ఈ
సినిమా అనంతరం
బాలయ్య బాబు అఖండ-2 సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతం
బాలయ్య బాబుకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిట్-4 సినిమాలో నందమూరి నరసింహం
బాలకృష్ణ హీరోగా నటించబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది.
బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా నాలుగు సినిమాలు మంచి విజయాలను అందుకోగా.... ఇప్పుడు తాజాగా
బాలయ్య బాబు హిట్-4 సినిమాలో నటించబోతున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం
బాలకృష్ణ అఖండ-2
సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ
సినిమా పూర్తయిన వెంటనే
బాలయ్య బాబు హిట్-4 సినిమాలో నటించబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి హిట్-4 సినిమాలో
బాలయ్య బాబు నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.