మూవీలో ఆ పేరు ఉంటే బ్లాక్ బస్టర్ .. టాలీవుడ్ కి అంతగా కలిసి వచ్చిన.. పేరు ఏమిటంటే..?

frame మూవీలో ఆ పేరు ఉంటే బ్లాక్ బస్టర్ .. టాలీవుడ్ కి అంతగా కలిసి వచ్చిన.. పేరు ఏమిటంటే..?

Amruth kumar
చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు ఎవరు ఎప్పుడు స్టార్ స్టేటస్ తెచ్చుకుంటారో చెప్పడం ఎంతో కష్టం .. అలాగే చిత్ర పరిచశ్ర‌మ‌లో వచ్చే సినిమాల విషయానికొస్తే ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో ఏ సినిమా ఎప్పుడు ప్లాప్‌ అవుతుందో చెప్పడం కూడా కష్టమే .. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సినిమాల్లో స్టోరీ సినిమా టైటిల్ పాటలు , సినిమాలో నటించే పాత్రల పేర్లు బట్టి కూడా హిట్ ప్లాప్‌లు ఆధారపడి ఉంటాయని కొందరు నమ్ముతారు .. అయితే ఇక్కడ కొన్ని సినిమాలకు అందులో పేర్లతో కూడా మంచి విజయాలు అందుకుంటాయని కూడా అంటారు .. అయితే ఈ నేపథ్యంలో మన చిత్ర పరిశ్రమలో ఓ పేరు ఉంటే మాత్రం సినిమాలు చాలావరకు మంచి విజ‌య‌లు  అందుకుంటాయని అంటున్నారు .. ఇంతకీ ఆ పేరు ఏంటి .. ఆ పేరుతో ఉన్న సినిమాలు ఏంటి ? అసలు ఆ పేరుకి ఎందుకింత క్రేజ్ వచ్చింది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.


హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు .. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల మన‌సులో ఎంతో అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది .. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ .. బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్ త‌మ అద్భుత‌మైన‌ నటనతో ప్రేక్షకులను మెప్పించారు .. అలాగే ఈ సినిమాలోని పాటలు ఎమోషన్ సీన్స్ గురించి ఇంత చెప్పుకున్న తక్కువే .. అయితే ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు సీత దానికి తగ్గట్టుగానే పాత్ర కూడా ఎంతో అందంగా ఉంటుంది. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వీరికి జంట‌గా సమంత , అంజ‌లిలు హీరోయిన్లుగా నటించారు .. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్గా నిలిచింది .. ఈ సినిమాలో కూడా హీరోయిన్ అంజలి పాత్ర పేరు సీత .. ఆమె పాత్ర కూడా సినిమాలో ప్రతి ప్రేక్షకుడి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ .. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది .. ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా పాత్ర పేరు కూడా సీత .. ఈమే పాత్ర కూడా సినిమాలో ఎంతో గొప్పగా ఉంటుంది.


నాగార్జున హీరోగా కళ్యాణ్ విష్ణు కురసాల డైరెక్షన్ లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన .. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నాగార్జున కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది .. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి నటించారు .. ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరు కూడా సీత .. ఈమె పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కంచె .. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది .. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు కూడా సీత .. సినిమా ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అలాగే గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోదావరి సినిమాలో హీరోగా సుమంత్‌ హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించారు .. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్ర పేరు కూడా సీత ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది .. ఈ నేపథ్యంలో సీత అనే పేరుతో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలు అందుకున్నాయని టాలీవుడ్ లో ఓ వార్త‌ వైరల్ గా మారింది .. ఈ క్రమంలోనే సీత పాత్రలో చాలా అద్భుతంగా ఇప్ప‌టివ‌ర‌కు చెప్పిన‌ సినిమాల్లో హీరోయిన్లు నటించి  ఆ కొట్టుకున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో కూడా సినిమాలు సీత పేరుతో హీరోయిన్ పాత్రతో వచ్చిన సినిమాలు కూడా ఇదే స్థాయిలో మెప్పిస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: