సంక్రాంతి
పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఏవో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో
వెంకటేష్, బాలకృష్ణ,
రామ్ చరణ్ వంటి హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. ఈ
సంక్రాంతి కానుకగా వచ్చిన మూడు పెద్ద హీరోల సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. అందులో మరి ముఖ్యంగా
సంక్రాంతి వస్తున్నాం
సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో
వెంకటేష్ హీరోగా చేయగా...
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో
సినిమా కూడా
బ్లాక్ బస్టర్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి
చౌదరి హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా
వెంకటేష్ కొడుకు పాత్రలో బుల్లి రాజు చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాను ఫ్యామిలీ
ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. కాగా, ఈ
సినిమా సక్సెస్ మీట్ ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ
ఈవెంట్ కి చిత్ర బృందం అందరూ విచ్చేసి సందడి చేశారు.
కాగా, ఈ
సినిమా గురించి దర్శకుడు
అనిల్ రావిపూడి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కనుక హిందీలో
రీమేక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు. హిందీలో అయితే హీరోగా
సల్మాన్ ఖాన్ రిమేక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని
అనిల్ రావిపూడి అన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సబ్జెక్టుతో ఉన్న సినిమాలని నార్త్
ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడతారని
అనిల్ రావిపూడి అన్నాడు.
సల్మాన్ ఖాన్ కి కూడా యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరోగా
బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంది. దీంతో
సల్మాన్ ఖాన్ తో కనక సంక్రాంతికి వస్తున్నాం
సినిమా చేస్తే తన కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిందీలోకి సంక్రాంతికి వస్తున్నాం
సినిమా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్త వైరల్ అవుతుంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.