ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 14 వ రోజు ఈ
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టు లో మంచి స్థానంలో నిలిచింది. కానీ ఓ మూడు సినిమాలను మాత్రం దాటలేకపోయింది. 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో
ప్రభాస్ హీరోగా
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన
బాహుబలి పార్ట్ 2
మూవీ 3.80 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా ,
అల్లు అర్జున్ హీరోగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో
సినిమా 2.77 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది.
మెగాస్టార్
చిరంజీవి హీరో గా
బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య
సినిమా 2.1 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , సంక్రాంతికి వస్తున్నాం
సినిమా 1.91 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.