టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన కమీడియన్ గా గుర్తింపును సంపాదించుకున్న సప్తగిరి ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అయిన కూడా అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమాలో కూడా సప్తగిరి లేడు. మరి అందుకు గల కారణాన్ని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... కమీడియన్ సప్తగిరి నా క్లోజ్ ఫ్రెండ్. నేను కందిరీగ సినిమాకు కథ రచయితగా పని చేశాను.
ఆ సినిమాలో నా కోసం ఒక పాత్ర కూడా రాసుకున్నాను. కానీ ఆ పాత్రను సప్తగిరి పై రూపొందించారు. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇకపోతే నేను ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాను. కానీ నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా సప్తగిరి లేడు. అందుకు ప్రధాన కారణం సప్తగిరి మాత్రమే. ఎలా అంటే ... ఒకానొక సమయంలో నేను ఒక సినిమాకు కథ రాస్తున్న సమయంలో నాకు సప్తగిరి ఫోన్ చేసి నాకేమైనా పాత్ర రాశావా లేదా అని అడిగాడు. అలాగే నాకు పాత్ర రాస్తే ఆ పాత్ర కచ్చితంగా సినిమా మొదటి నుండి చివరి వరకు ఉండాలి. ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోయే పాత్ర నాకు అస్సలు రాయకు అన్నాడు. అలాంటి పాత్ర ఇప్పటి వరకు నా సినిమాలో లేదు. అందుకే సప్తగిరి నా సినిమాల్లో ఇప్పటివరకు కనిపించలేదు. ఒక రకంగా సప్తగిరి నా సినిమాలో ఉండకపోవడానికి కారణం అతనే. ఏ పాత్ర అయినా సరే చేస్తాను అని ఉంటే నా సినిమాల్లో చాలా పాత్రలో సప్తగిరి కనిపించేవాడు. అలా అనకపోవడం వల్ల ఇప్పటి వరకు మా కాంబినేషన్లో సినిమా రాలేదు అని అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.