అందరూ అనుకున్నట్లే అయ్యిందిగా.. "తండేల్" ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరి నోట అదే మాట..!
నాగచైతన్య - సాయి పల్లవి కాంబోలో ఆల్రెడీ "లవ్ స్టోరీ" అనే మూవీ వచ్చింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య కన్నా హీరోయిన్గా నటించిన సాయి పల్లవి కే మంచి మార్కులు పడ్డాయి. సినిమా సక్సెస్ అంతా కూడా సాయి పల్లవి ఎగరేసుకునిపోయింది. మరొకసారి సినిమా అనగానే జనాలు కచ్చితంగా ఈ సినిమాకి మొత్తం సాయి పల్లవినే హైలెట్ గా మారిపోతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూశాక ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసుకున్నారు .
ట్రైలర్ మొత్తానికి సాయి పల్లవి నటన ..డైలాగులు హైలెట్గా మారాయి . అంతేకాదు సాయి పల్లవి ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఆమె నటనా పర్ఫామెన్స్ ఒకలా ఉంటే ఈ సినిమాలో నటించిన పర్ఫామెన్స్ మాత్రం వేరేలా ఉండబోతుంది అంటూ రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలిసిపోతుంది . దీంతో సోషల్ మీడియాలో మళ్లీ నాగచైతన్య ఫ్యాన్స్ పాత విషయాన్ని లేవదీస్తున్నారు. అంతేకాదు సాయి పల్లవి నటన సూపర్ గా ఉంది అంటూ నాగచైతన్య పర్ఫామెన్స్ ఓకే అన్న రేంజ్ లో కామెంట్స్ వినిపిస్తూ ఉండడంతో సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది ..? సినిమా హిట్ అయిన నాగచైతన్యకు ఎంతవరకు ప్లస్ గా మారబోతుంది అనే విషయం ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . మొదటి నుంచి అనుకున్నదే జరిగింది అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ కూడా "తండేల్" విషయంలో సాయి పల్లవి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..? ఫిబ్రవరి 7వ తేదీ నాగచైతన్య లైఫ్ ని ఎలా టర్న్ చేయబోతుందో..??