![ఆ డైరెక్టర్ తో సినిమా వద్దే వద్దు..ఫ్యాన్స్ సలహాలను ఎన్టీఆర్ పట్టించుకుంటారా?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/tarak5dfd0c23-bf93-43ae-8b6a-8e60c88eb9a2-415x250.jpg)
ఆ డైరెక్టర్ తో సినిమా వద్దే వద్దు..ఫ్యాన్స్ సలహాలను ఎన్టీఆర్ పట్టించుకుంటారా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో అభిమానించే డైరెక్టర్లలో వేట్రిమారన్ కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో వేట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. అదే సమయంలో వేట్రిమారన్ నిర్మించిన కొన్ని సినిమాల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వేట్రిమారన్ తో సినిమా వద్దంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వేట్రిమారన్ నిర్మించిన బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ తరహా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను తారక్ పట్టించుకుంటారా లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వేట్రిమారన్ సైతం తనపై విమర్శలు రాకుండా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా 2026 సంవత్సరంలో తారక్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో తారక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.