సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో సక్సెస్ను అందుకొని స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రమే దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో విజయాన్ని అందుకొని తమకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఇండస్ట్రీలో ఏర్పరచుకుంటారు. అలా తెలుగు
సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన 10 సంవత్సరాలలో 8 సినిమాలను రూపొందించి 8 మూవీలలో కూడా అద్భుతమైన విజయాలను అందుకొని సూపర్ సాలిడ్ గా కెరియర్లో ముందుకు సాగిస్తున్న వారిలో
అనిల్ రావిపూడి ఒకరు.
దానితో ఈయన 10 సంవత్సరాల కెరియర్ లో 8 సినిమాలు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనిమిది మూవీలతో కూడా అద్భుతమైన విజయాలను అందుకొని సూపర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇకపోతే అదిల్ రావిపూడి తన తదుపరి
మూవీ ని
మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతుంది. ఈ సినిమాతో కూడా
అనిల్ అద్భుతమైన విజయాన్ని అందుకుంటాడు అని ఎంతోమంది భావిస్తున్నారు.