తారక్ గత ఐదు చిత్రాల కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

frame తారక్ గత ఐదు చిత్రాల కలెక్షన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు..గత ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా వున్నారు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో కనిపిస్తున్నారు.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నాడు.. ఆ తరువాత దేవర 2 కూడా ఉండటంతో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీగా వున్నారు..ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ తెరకెక్కుతున్నాయి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు అంతే భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి..ఎన్టీఆర్ గత 5 సినిమాల కలెక్షన్స్ చూస్తే ఇది అర్ధం అవుతుంది..

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘ నాన్నకు ప్రేమతో ‘.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా తెరకెక్కించాడు..ఈ సినిమాను 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా టోటల్ కలెక్షన్స్ 87 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత ఎన్టీఆర్ మైత్రీ మూవీస్ బ్యానర్ పై కొరటాల శివ డైరెక్షన్ “జనతా గ్యారేజ్” అనే బిగ్గెస్ట్ మూవీలో నటించాడు.. ఈ సినిమాను 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా ఏకంగా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అల్ టైం బ్లాక్ బస్టర్ అయింది..

 ఆ తరువాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో “ జై లవకుశ “ అనే సినిమా చేసాడు.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.. ఈ సినిమా 130 కోట్లు సాధించి బాబీ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్ మూవీ “ అరవింద సమేత”.. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ 90 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమా 160 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్“.. దాదాపు 500 కోట్లతో నిర్మాత డివివి దానయ్య నిర్మించారు.. ఈ సినిమా ఏకంగా 1290 కోట్లు సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మరోసారి కొరటాల డైరెక్షన్ లో “ దేవర “ అనే సినిమా చేసాడు.. ఈ సినిమాను 300 కోట్లతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయగా 500 కోట్లు కలెక్షన్స్ సాధించి మంచి విజయం అందుకుంది.. ఇలా ఎన్టీఆర్ వరుస సినిమాలతో తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: