పుష్ప 2 : కర్ణాటకలో 32 కోట్ల బిజినెస్.. ఇప్పటికీ ఎంత వచ్చిందో తెలుసా..?

frame పుష్ప 2 : కర్ణాటకలో 32 కోట్ల బిజినెస్.. ఇప్పటికీ ఎంత వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన హీరోయిన్గా నటించగా .. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఏరియాలలో కర్ణాటక ఏరియా ఒకటి. కర్ణాటక ఏరియాకు గాను ఈ సినిమాకు 32 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ మూవీ కర్ణాటక ఏరియాలో అదిరిపోయి రేంజ్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.


ఇక ఇప్పటికే కర్ణాటక ఏరియాలో ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి కర్ణాటక ఏరియాలో ఈ మూవీ కి 53.40 కోట్ల రేంజ్ లో షేర్ ... 144 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా ఈ ఏరియాలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: