12వ రోజు పాన్ ఇండియా మూవీలకు దమ్కి ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇది కథ రికార్డ్ అంటే..?

frame 12వ రోజు పాన్ ఇండియా మూవీలకు దమ్కి ఇచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇది కథ రికార్డ్ అంటే..?

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ తాజా గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించ గా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాలు నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న విషయం అందరి కీ తెలిసిందే.


తాజాగా ఈ మూవీ కి సంబంధించిన 12 వ రోజు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 12 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు సినిమాల్లో అద్భుతమైన స్థానంలో నిలిచింది. 12 వ రోజు బాహుబలి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.49 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా 4.90 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది.


ఆర్ ఆర్ ఆర్ మూవీ 4.88 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , పుష్ప పార్ట్ 2 సినిమా 3.07 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. సైరా నరసింహా రెడ్డి సినిమా 2.98 కోట్ల కలెక్షన్లతో ఐదవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను చేసి తెలుగు రాష్ట్రాల్లో 12 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏకంగా రెండవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: