
పెళ్లంటే ఫైర్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్.. కారణం..?
దీంతో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా శృతిహాసన్ పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉండడంతో శృతిహాసన్ కి కూడా విసిగిపోయి మరి వారి మీద ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల శృతిహాసన్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. దక్షిణాదిలోని ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే మళ్లీ తన హవా కొనసాగించేలా కనిపిస్తుంది.
గతంలో హీరో సిద్ధార్థ్ ,నాగచైతన్య, ధనుష్ ,వంటి వారితో శృతిహాసన్ ప్రేమ వ్యవహారాలు నడిపిందని వార్తలు వినిపించాయి.. కానీ వివాహం గురించి అడిగితే మాత్రం తనకు ఇప్పుడప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదని ఇక మీదట ఇలాంటి ప్రశ్నలు అడగకపోవడమే మంచిది అంటు వెల్లడించింది శృతిహాసన్.. శృతిహాసన్ కెరియర్లో లవ్ ఫెయిల్యూర్స్ చాలానే ఉన్నాయని అందుకే శృతిహాసన్ పెళ్లి అంటే విరక్తి చెందిపోయింది అనే విధంగా పలువురు నెట్టిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ హీరోలకే కాదు జూనియర్ హీరోలకు కూడా జోడిగా నటిస్తున్న శృతిహాసన్ పెళ్లి కోసమైతే అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా వివాహ బంధం లోకి అడుగుపెడుతూ ఉంటే శృతిహాసన్ ఇంకా లవ్ బ్రేకప్ వ్యవహారాలలోనే కాలం గడిపేస్తోంది.