రాత్రికి రాత్రే ఛాప్టర్ క్లోజ్..ఆ హీరో కెరియర్ ఎదగనీకుండా చేసిన రామ్ చరణ్..!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతనైతే సహాయం చేస్తాడు కానీ తెలిసి తెలిసి ఎవరికీ ద్రోహం చేయడు. అయితే ఒకానొక సందర్భంలో మాత్రం రామ్ చరణ్ ఒక వ్యక్తి కెరీర్ ని ఎదగనీకుండా అడ్డుపట్టాడు అని పరోక్షకంగా ఆ హీరోకి ఆఫర్స్ రాకుండా చేశాడు అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు "ఆది పినిశెట్టి". ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. నో డౌట్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గా ఎదిగిన హీరోల కన్నా కూడా ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది .
ఏ రోల్ నైనా సరే అవలీలగా నటించేస్తాడు . అది హీరోనా.. విలనా..? అని ఆలోచించడు . అయితే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి అన్న క్యారెక్టర్ లో నటించాడు "ఆది పినిశెట్టి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత చాలామంది రాంచరణ్ కన్నా "ఆది పినిశెట్టి"ని పొగిడేసారు. ఈ క్రమంలోనే ఎక్కడ ఆదిపనిశెట్టి తెలుగులో చరణ్ కన్నా పెద్ద స్టార్ అయిపోతాడు అన్న భయంతో బ్యాక్ గ్రౌండ్ లో ఉండే పెద్ద మనుషులు ఆయన కెరియర్ని ఎదగనీకుండా చేశారట . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ చాలామంది అప్పట్లో చరణ్ ని ట్రోల్ చేశారు . ఎంతమంది హీరోల కెరియర్లని ఆడుకోలేదు ఈ పెద్ద వ్యక్తులు అంటూ ఘాటు ట్రోల్ చేశారు. ఈ విషయాన్ని మరొకసారి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఆ కారణంగానే గతంలో రాంచరణ్ చేసిన కొన్ని ఫ్లాప్ లు..ఇప్పుడు శాపంగా మారాయి అంటూ హద్దులు మీరిపోతున్నారు..!