తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడి గా తనకంటూ ఒక మార్క్ ను ఏర్పరచుకున్న వారిలో శ్రీను వైట్ల ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభం లో ఎక్కువ శాతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాల ను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఈయన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను రూపొందించాడు . ఇక పోతే ఈయనకు కెరియర్లో ఆనందం సినిమా ద్వారా మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది . ఈ సినిమాతో ఈయన క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. ఆ తర్వాత కూడా ఈయన మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు.
ఈయనకు డీ , రెడీ సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలు వచ్చాయి. ఈ మూవీ లతో ఈయన క్రేజ్ తెలుగు లో భారీగా పెరిగింది. అలాంటి సమయం లోనే ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సమంత హీరోయిన్గా దూకుడు అనే పవర్ఫుల్ యాక్షన్ , ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది.
దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ విజయంతో శ్రీను వైట్ల క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇక దూకుడు లాంటి పవర్ఫుల్ హిట్ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈ దర్శకుడు గోపీచంద్ హీరో గా విశ్వం అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాలు నడప విడుదల ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.