చిరుకి పోటీగా రవితేజ.. ఎవరిది పై చేయి కానుంది..?

frame చిరుకి పోటీగా రవితేజ.. ఎవరిది పై చేయి కానుంది..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు.


కానీ ఆ తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి శ్రీ లీలా హీరోయిన్గా నటిస్తూ ఉండగా  ... భాను భోగవరపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.


దానితో విశ్వంభర సినిమా కూడా మే 9 వ తేదీన విడుదల అయినట్లయితే చిరు , రవితేజ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశాలు ఉంటాయి. అలా తలపడినట్లయితే ఎవరి సినిమా విజయం సాధిస్తుందా అనే దానిపై జనాల్లో ఆసక్తి నెలకొనే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు ఏ తేదీన విడుదల అవుతాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: