చిన్న కారణంతో చేసిన బ్లాక్‌బస్టర్ ను రిజెక్ట్ చేసిన విజయ్..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన కథల్లో మరొకరు హీరోగా నటించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అలా రిజెక్ట్ చేసిన మూవీలు విజయాలను అందుకున్నట్లయితే ఆ హీరోలు బాధపడడం , అదే సినిమాలు ఫ్లాప్ అయినట్లయితే ఆ మూవీ నుండి ఎస్కేప్ అయ్యాము అని ఆనంద పడటం జరగడం కూడా చాలా చిన్న విషయం. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని సినిమాలను రిజెక్ట్ కూడా చేశాడు. విజయ్ ఓ మూవీని రిజెక్ట్ చేయగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఆ సినిమా ఏది ..? ఎందుకు ఈయన రిజక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా నీది అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్లు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా రామ్ , నీది , నబా నటేష్ , పూరి జగన్నాథ్ కి మంచి పేరు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాను మొదట పూరి జగన్నాథ్ , రామ్ తో కాకుండా విజయ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న విజయ్ కథ సూపర్ గా ఉంది కానీ నేను ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. మీరు ఈ కథతో వేరే వారితో సినిమా చేయండి అని సలహా ఇచ్చాడట. ఇక దానితో పూరి జగన్నాథ్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ ని రామ్ తో రూపొందించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: