పోయినసారి నాగ్.. ఈసారి వెంకీ.. ఓకే ఫార్ములాతో సూపర్ హిట్స్..?

frame పోయినసారి నాగ్.. ఈసారి వెంకీ.. ఓకే ఫార్ములాతో సూపర్ హిట్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పోయిన సంవత్సరం నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. నా సామి రంగ సినిమాను పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసి నాగార్జున మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతికి చాలా తక్కువ రోజుల ముందు మొదలు పెట్టారు.


ఈ సినిమాను సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానితో చాలా మంది ఈ మూవీ యూనిట్ సంక్రాంతికి చాలా తక్కువ రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసింది. మరి అన్ని తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ మూవీ ని సంక్రాంతి పండక్కు విడుదల చేయడం అంత ఈజీ విషయం ఏమీ కాదు అనే చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ బృందం మాత్రం ఈ సినిమా షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఈ మూవీ ని సంక్రాంతికి విడుదల చేశారు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది. ఇకపోతే విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కూడా సంక్రాంతికి చాలా తక్కువ రోజుల ముందు మొదలు పెట్టారు.


ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి జెట్ స్పీడ్ లో పూర్తి చేసి ఈ మూవీ ని ముందు చెప్పినట్లు సంక్రాంతి బరిలో నిలిపాడు. ఇక సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం నాగ్ , ఈ సంవత్సరం వెంకీ చాలా తక్కువ రోజుల్లో తమ సినిమాలను పూర్తి చసి సంక్రాంతి పండుగకు విడుదల చేసే అద్భుతమైన విజయాలను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: