చరణ్ వ్యూహాలను అమలు పరుస్తున్న బుచ్చిబాబు !

Seetha Sailaja
‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చరణ్ కెరియర్ లో అభిమానులు మరచిపోలేని ఫ్లాప్ గా ఈమూవీ మారిపోయింది. మెగా ఫ్యాన్స్ కూడ ఈసినిమాను ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోవడంతో వారంతా దిగాలు పడిపోయారు. ఈమూవీ కనీసం 100 కోట్ల నెట్ కలక్షన్స్ ను కూడ అందుకోలేకపోవడం చరణ్ అభిమానులను కలవర పెడుతోంది .



ఇలాంటి పరిస్థితులలో అభిమానుల ఆశలు అన్నీ బుచ్చిబాబు చరణ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే ప్రారంభం అయిన మూవీ పై ఉన్నాయి. దీనికితోడు ఈమూవీలో చరణ్ పక్కన హీరోయిన్ గా జాహ్నవీ నటిస్తూ ఉండంతో ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈమూవీ పై ప్రారంభం నుండి అంచనాలు బాగానే ఉన్నాయి.



‘ఉప్పెన’ ఘన విజయం తరువాత బుచ్చి బాబుకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని వదులుకుని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయడమే ప్రధాన ధ్యేయంగా కొన్ని సంవత్సరాలు గడిపినప్పటికీ తారక్ డేట్స్ బుచ్చి బాబుకు లభించక పోవడంతో యూటర్న్ తీసుకుని చరణ్ తో ఈమూవీని ఫైనల్ చేశాడు. ఈసినిమాకు ‘పెద్ది’ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా  మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అన్న ఆలోచన మొదట్లో చేశారని టాక్.



అయితే ‘గేమ్ ఛేంజర్’ ఊహించని ఘోర పరాజయం అందుకోవడంతో ఎలర్ట్ అయిన రామ్ చరణ్ తన ఇమేజ్ ని కాపాడుకోవడానికి బుచ్చి బాబు దర్శకత్వంలో నటిస్తున్నమూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసి ఆమూవీని ఈసంవత్సరం ‘దసరా’ కు విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ టాప్ హీరో శివ రాజ్ కుమార్ కు క్యాన్సర్ రావడంతో ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్న ఆయన ఎంతవరకు రామ్ చరణ్ స్పీడ్ కు తగ్గట్లుగా తన డేట్స్ ఇవ్వగలడు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: