సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఎంతో మంది కెరియర్ ప్రారంభంలో ఇతర పనులు చేసి ఆ తర్వాత సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు అనేక మంది ఉన్నారు . అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రియ భవాని శంకర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో ఈమె సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన కళ్యాణం కమనీయం సినిమాలో హీరోయిన్ గా నటించింది.
పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది. న్యూస్ రీడర్ గా పని చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్న తర్వాత ఈమె సినిమా రంగం వైపు ఆసక్తిని చూపించింది.
అందులో భాగంగా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మకు మంచి విజయాలు దక్కడం , అలాగే ఈమె నటించిన సినిమాల్లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు నటిగా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. అలాగే ఆ తర్వాత ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రియ భవాని శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.