సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ కావడానికి చదువు కంటే కూడా విజయాలు ప్రధానం. సినిమా ఇండస్ట్రీ లో తక్కువ చదువుకున్న కూడా అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు అనేక మంది ఉన్నారు. తక్కువ చదువు చదివిన కూడా ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటీలలో ఆదా శర్మ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇంటర్ చదివింది.
ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన హార్ట్ ఎటాక్ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో ఆదా శర్మ తన నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో అవకాశాలు వరుసగా పెరిగాయి. ఈమె కూడా చాలా సినిమాల్లో నటించింది.
కానీ ఈమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చిన విజయాలు మాత్రం భారీ స్థాయిలో దక్కలేదు. దానితో ఈమెకు మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమెకి భారీగా సినిమాల అవకాశాలు రావడం లేదు. కానీ ఈమె సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. ఇకపోతే ఆదా శర్మ ఎన్నో సినిమాల్లో తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ వస్తుంది.